సివిల్ సైప్లె వడ్లకు గిరాకీ ఢమాల్!
బహిరంగ మార్కెట్లో రైతుల వడ్లకు భారీ డిమాండ్ పలుకుతుండగా.. సివిల్ సైప్లె ధాన్యం కొనుగోలుకు దిక్కేలేకుండా పోయింది. రైతుల ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతుంటే.. సివిల్ సైప్లె ధాన్యం కొనుగోలుకు ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు.
- రెండుసార్లు ధాన్యం వేలానికి ఆదరణ కరువు
- 17 లక్షల టన్నులకు 3లక్షలే విక్రయం
- నిబంధనలే అడ్డు అంటున్న వ్యాపారులు
- ఓపెన్ వేలానికి అధికారుల కసరత్తు
హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : బహిరంగ మార్కెట్లో రైతుల వడ్లకు భారీ డిమాండ్ పలుకుతుండగా.. సివిల్ సైప్లె ధాన్యం కొనుగోలుకు దిక్కేలేకుండా పోయింది. రైతుల ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడుతుంటే.. సివిల్ సైప్లె ధాన్యం కొనుగోలుకు ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు. మిగులు ధాన్యాన్ని విక్రయించేందుకు రెండుసార్లు వేలం వేసినప్పటికీ స్పందన కరువైంది. దీంతో వేలంలో ధాన్యం అమ్ముడుపోక సివిల్ సైప్లె శాఖకు నష్టాలు పెరిగిపోతున్నాయి. సుమారు రూ.4 వేల కోట్ల ధాన్యం గోదాముల్లో, మిల్లుల్లోనే మూలుగుతున్నది. ఆ ధాన్యాన్ని అమ్మి నష్టాలు పూడ్చుకొని కష్టాల నుంచి బయటపడేందుకు సివిల్ సైప్లె అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ, వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఓవైపు ఇప్పటికే వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి వారికి అవసరమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరోసారి సివిల్ సైప్లె ధాన్యం వేలం వేస్తే ఫలితం దక్కుతుందా? లేదా? అనే సందేహాలు ఆ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మిగులు ధాన్యం వేలం కోసం ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు టెండర్లను ఆహ్వానించింది. అక్టోబర్‌లో తొలిసారి 11.72 లక్షల టన్నుల ధాన్యం వేలం వేసింది. ఆ టెండర్లకు బిడ్డర్ల నుంచి స్పందన కరువై కేవలం 50 వేల టన్నులే అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో మరికొంత ధాన్యం జత చేసి గత నెల 22న 16.93 లక్షల టన్నుల విక్రయానికి వేలం వేసింది. ఈసారి కూడా సివిల్ సైప్లె శాఖకు నిరాశ తప్పలేదు. ఇందులో కేవలం 3 లక్షల టన్నులు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇలా ధాన్యం విక్రయించేందుకు రెండుసార్లు వేలం వేసినప్పటికీ వ్యాపారులు, మిల్లర్లు ముందుకు రాలేదు.
బహిరంగ వేలానికి మొగ్గు !
ధాన్యం వేలానికి స్పందన రాకపోవడానికి వ్యాపారులు, మిల్లర్లు పలు కారణాలు చెప్తున్నారు. మిల్లర్లు ఎవరికి వారుగా కొనుగోలు చేసే వీలు లేకుండా, చిన్న వ్యాపారులు కొనలేకుండా లాట్ల వారీగా ధాన్యం వేలం వేయడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. కనీస ధర నిబంధనపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సైప్లె వేలం కనీస ధరను క్వింటాకు రూ.2,389గా నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతుల డిమాండ్ తగ్గిపోవడంతో అంత ధరకు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదని తెలిసింది. గతంలో ఎగుమతి ధర క్వింటా బియ్యానికి కు రూ.3,600 వరకు ఉండగా, ప్రస్తుతం అది రూ.3,400కు పడిపోయినట్టు తెలిసింది. దీనికి తోడు ఇతర ఖర్చులు కలిపితే మరింత నష్టం వస్తుందనే వ్యాపారులు టెండర్‌కు దూరంగా ఉంటున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు లాట్ల వారీగా ఎంత ధాన్యం ఉంటే అంత వేలం వేసేలా, ఎవరికి ఎంత వీలైతే అంత కొనుగోలు చేసేలా నిబంధనల్లో మార్పులు తేవాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
రూ.4 వేల కోట్ల భారం
వేలంలో ధాన్యం విక్రయించకపోవడంతో రూ.4 వేల కోట్లకు పైగా విలువైన ధాన్యం గోదాములు, మిల్లుల్లో మూలుగుతున్నది. ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో సివిల్ సైప్లె శాఖపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. ఒకవైపు అప్పులు పెరిగిపోతుండడంతో పాటు వాటికి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రతినెలా సుమారు రూ.25 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే మిల్లర్లు సరైన సమయంలో సీఎమ్మాఆర్ ఇవ్వకపోవడంతో నష్టాలను మూటగట్టుకుంటున్న సంస్థకు.. ఇప్పుడు అధికారుల తప్పులు మరింత నష్టాలు తెస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

