First Audi Car Owner | మనదేశంలో తొలి ఆడి కారు యజమాని ఈ క్రికెటరే.. సచిన్, ధోనీ మాత్రం కాదు సుమా!
First Audi Car Owner :సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లకు రకరకాల కార్లంటే మోజు అనే విషయం తెలిసిందే. అందులోనూ ఎన్నో ప్రత్యేకతలున్న ఆడి కారు (Audi Car) అంటే ఇష్టపడని వారుండరు. అయితే.. ఇంతకు మనదేశంలో ఆడి కారు తొలి యజమాని ఎవరో తెలుసా?.. ఓ క్రికెటర్. అలాగని అతను ఎంఎస్ ధోనీ (MS Dhoni), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), యువరాజ్ సింగ్ (Yuvraj Singh) అని అనుకుంటే పొరపడినట్టే...
First Audi Car Owner :సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లకు రకరకాల కార్లంటే మోజు అనే విషయం తెలిసిందే. అందులోనూ ఎన్నో ప్రత్యేకతలున్న ఆడి కారు (Audi Car) అంటే ఇష్టపడని వారుండరు. అయితే.. ఒకప్పుడు ఇవి ఏ కొద్ది మంది దగ్గరో ఉండేవి. కానీ, ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బోలెడు కనిపిస్తున్నాయి. ఇంతకు మనదేశంలో ఆడి కారు తొలి యజమాని ఎవరో తెలుసా?.. ఓ క్రికెటర్. అలాగని అతను ఎంఎస్ ధోనీ (MS Dhoni), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), యువరాజ్ సింగ్ (Yuvraj Singh) అని అనుకుంటే పొరపడినట్టే. 1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ చాంపియన్‌షిప్ హీరో రవి శాస్త్రి(Ravi Shastri). అవును.. మనదేశంలో తొలి ఆడి కారు ఓనర్ అతనే.
ఆస్ట్రేలియాలో జరిగిన బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ చాంపియన్‌షిప్(Benson And Hedges championship) ట్రోఫీలో రవి శాస్త్రి అద్భతంగా రాణించాడు. దాంతో, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ (Player of the Series) అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుతోపాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఆడి 100’ (Audi 100)ను బహుమతిగా అందుకున్నాడు. దాంతో, మన దేశంలో ఆడి కారును సొంతం చేసుకున్న తొలి క్రికెటర్‌గా, తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆ కారుతో రవి శాస్త్రికి బోలెడంత పాపులారిటీ లభించింది.
ఆడి కారుతో రవి శాస్త్రి

మియాందాద్‌తో పోటీ
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కోసం రవిశాస్త్రి, పాకిస్థాన్ క్రికెటర్ జావెద్ మియాందాద్ (Javed Miandad) మధ్య పోటీ నెలకొంది. ఈ టోర్నీలో ఇద్దరూ అద్భుత ప్రతిభ కనబరిచడమే అందుకు కారణం. అయితే.. మరింత మెరుగ్గా రాణించినందుకు ఆ బహుమతి రవిశాస్త్రికే దక్కింది. దేశంలోనే మొట్టమొదటి ఆడి కారుకు యజమానిగా మారిన రవిశాస్త్రి ఆ ఘనత సాధించి రికార్డులకెక్కాడు.
పోటీ పడి కారెక్కారు
రవి గెలుచుకున్న ఆడి 100 కారును చూసి కపిల్ దేవ్ (Kapil Dev) సహా తోటి ఆటగాళ్లందరూ థ్రిల్‌గా ఫీలయ్యారు. ఆ కారులో ఒక్కసారైనా ఎక్కి ప్రయాణించాలని పోటీపడ్డారు. ట్రోఫీ విజయానంతర సంబురాలు చేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ఆ ఆడి కారు ఎక్కి మురిసిపోయారు. అంతేకాదు భారత్‌లో ఆడి కారు తొలి యజమానికి గుర్తింపు సాధించిన రవి శాస్త్రిని మనసారా అభినందించారు.
ఆడి కారుపై ఎక్కి సంబురపడుతున్న భారత క్రికెటర్లు

తండ్రికి కూడా నో ఎంట్రీ
స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్ నంబరు ఎంఎఫ్ఏ 1(MFA 1) కలిగిన ఈ కారు రవిశాస్త్రి వద్ద ఇప్పటికీ భద్రంగా ఉంది. దీనిని అతడు అత్యంత అమూల్యమైన ఆస్తిగా పరిగణిస్తాడు. సెంటిమెంట్ అంతేకాదు టీమిండియా విజయానికి గుర్తుగా వచ్చిన ఆ కారును అతను అపురూపంగా చూసుకుంటాడు. ఆ కారంటే రవిశాస్త్రికి ఎంత ప్రాణమంటే..? చివరికి తన తండ్రి జయద్రిథ శాస్త్రి(Jayadritha Shastri)కి కూడా ఆ కారు నడిపేందుకు అనుమతించ లేదు. ఈ విషయాన్ని పలుమార్లు రవిశాస్త్రి స్వయంగా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి
INDW vs BANW | క్లీన్‌స్వీప్ జస్ట్ మిస్.. మూడో టీ20లో భారత మహిళల జట్టు ఓటమి
ODI WC 2023 | వరల్డ్ కప్ షెడ్యూల్ అప్డేట్.. శ్రీలంక, నెదర్లాండ్స్ తొలి పోరు ఈ జట్లతోనే..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

