తమిళ ఎంట్రీకి సిద్ధం
పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటారు తరుణ్‌భాస్కర్. మరోవైపు నటుడిగా కూడా తనదైన ముద్రను వేస్తున్నారు. తాజాగా ఆయన తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటారు తరుణ్‌భాస్కర్. మరోవైపు నటుడిగా కూడా తనదైన ముద్రను వేస్తున్నారు. తాజాగా ఆయన తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో తరుణ్‌భాస్కర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వాస్తవానికి ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు, నటుడు అశ్వత్ మారిముత్తును ఎంపిక చేశారు. అయితే ఆయన ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘ధర్మన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో పాటు ఇతర ప్రాజెక్ట్స్‌లతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సమస్యలు ఎదురయ్యాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తరుణ్‌భాస్కర్‌ను తీసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ప్రదీప్‌రంగనాథన్ సరసన మమితాబైజు కథానాయికగా నటించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

