కిరీటం ధరించగానే రావణుడిగా మారిపోయా!
‘రామాయణ’ చిత్రంలో రావణుడి పాత్రను ఎంచుకున్నప్పుడు తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా అనేక ప్రశ్నలు ఎదురయ్యాయని అగ్ర హీరో యశ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘రామాయణ: రైజ్ ఆఫ్ లెజెండ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది.
‘రామాయణ’ చిత్రంలో రావణుడి పాత్రను ఎంచుకున్నప్పుడు తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా అనేక ప్రశ్నలు ఎదురయ్యాయని అగ్ర హీరో యశ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘రామాయణ: రైజ్ ఆఫ్ లెజెండ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘ది మేకింగ్ ఆఫ్ రావణ’అనే వీడియోను విడుదల చేసింది. ఇందులో తాను రావణుడి పాత్రను పోషించడానికి గల కారణాలను వెల్లడించారు యశ్. ప్రజలు తమ ఆరాధ్యదైవంగా భావించే రాముడిలాంటి హీరో ఉన్నప్పుడు, అందరూ ద్వేషించే ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తే ప్రజలు ఆదరణ చూపించరని తన సన్నిహితులందరూ వారించారని యశ్ పేర్కొన్నారు. ‘ఎప్పుడైతే ఈ సినిమా నిర్మాణంలో భాగం కావాలనుకున్నానో అప్పుడే రావణుడి పాత్రను పోషించాలనే కోరిక కలిగింది.
ఈ విషయంలో నేను ఎవరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. స్టార్డమ్ కంటే రామాయణంలో భాగం కావడమే ముఖ్యం అనుకున్నా. రామాయణం మన కథ. మనలో ఎవరూ రామాయణం కంటే గొప్పవారు కాదు’ అని యశ్ అన్నారు. రావణుడిని కేవలం ప్రతినాయకుడిగా మాత్రమే చూడలేమని, రాముడు హృదయమైతే, రావణుడు మెదడులాంటి వాడని, మనసు-మేధస్సు మధ్య సంఘర్ణణగా ఈ రెండు పాత్రల్ని అర్థం చేసుకోవాలని యశ్ వివరించారు. షూటింగ్ సమయంలో కిరీటం ధరించగానే రావణుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశానని, ఆ క్షణంలో తనలో ఏదో ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని యశ్ చెప్పారు. సీతారాముల పాత్రల్లో రణబీర్‌కపూర్, సాయిపల్లవి నటించిన ‘రామాయణ’ చిత్రానికి నితేష్ తివారి దర్శకత్వం వహించారు. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

