లెర్నింగ్ లైసెన్స్.. ఇక ఇంటి నుంచే!
ఇకపై లైసెన్స్ పొందాలంటే క్లచ్, యాక్సిలేటర్, స్టీరింగ్‌పై పట్టుసాధించడం ఎంత ముఖ్యమో.. రోడ్డు నిబంధనలపై అవగాహన పొందడం కూడా అంతే ముఖ్యంగా మారింది.
- కూకట్పల్లి పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం
- 2,155 మంది నమోదు ..1968 మందికి లైసెన్స్జారీ
సిటీబ్యూరో, నవంబర్ 6 ( నమస్తే తెలంగాణ ) : ఇకపై లైసెన్స్ పొందాలంటే క్లచ్, యాక్సిలేటర్, స్టీరింగ్‌పై పట్టుసాధించడం ఎంత ముఖ్యమో.. రోడ్డు నిబంధనలపై అవగాహన పొందడం కూడా అంతే ముఖ్యంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు లెర్నింగ్ లైసెన్స్ పొందిన వెంటనే శాశ్వత లైసెన్స్ పరీక్షకు హాజరయ్యే విధానం ఉండేది. అయితే ఈ మధ్యలో మరో పరీక్ష కూడా ఉండబోతుంది. అదే రోడ్డు నిబంధనలపై వీడియోలు వీక్షించడం. న్యూయార్క్‌లో అమలులో ఉన్న ఈ వీడియో పరీక్ష విధానాన్ని తెలంగాణ రవాణా శాఖ అమలు చేస్తున్నది.
రోడ్డు భద్రత వీడియోలు వీక్షించి అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే శాశ్వత లైసెన్స్ స్లాట్ బుక్ అవుతుంది. ఒకవేళ విఫలమైతే మళ్లీ ఆ వీడియోలు వీక్షించాల్సిందే. అయితే ఈ మొత్తం లెర్నింగ్ ప్రకియ ఇంటి నుంచే పొందేల రవాణా శాఖ ఆన్లైన్ సేవలను తీసుకొచ్చింది. అయితే ఈ విధానం దరఖాస్తుదారులకు కొంత కఠిన పరీక్షనే పెట్టబోతుంది. శాశ్వత లైసెన్స్ పొందడానికి ముందర అంటే ఎల్ఎల్ఆర్ పొందడం, ఆ తర్వాత రోడ్డు నిబంధనల కోర్సు వీక్షించడం, వాటికి సంబంధించిన పరీక్ష రాయడం ఇలాంటి ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు స్లాట్ బుక్ చేస్కొని సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఫొటో దిగి, ఆన్లైన్ పరీక్ష అధికారుల పర్యవేక్షణలో రాయాల్సి వచ్చేది.
అందులో ఓకే అయితే అప్పటికప్పుడు లెర్నింగ్ లైసెన్స్ అందించేవారు. ఆ తర్వాత నెల రోజుల అనంతరం 6 నెలలలోపు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరై శాశ్వత లైసెన్స్ పొందేవాళ్లు. అయితే ఇప్పుడు లెర్నింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. అందుకు సంబంధించి కూకట్‌పల్లిని పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి ఆర్టీఏ అధ్యయనం చేసింది. దీని ప్రకారం దరఖాస్తుదారులు రోడ్డు భద్రతకు సంబంధించిన 64 నిబంధనల్ని తెలుసుకోవాలి. వీటిపై 120 వీడియోలను చూడాల్సి ఉంటుంది. ఒక్కోటి 20 నిమిషాల చొప్పున ఆరు మాడ్యుళ్లు ఉంటాయి. సుమారు రెండున్నర గంటల వీడియోగా ఉంటుంది.
తమకు నచ్చిన సమయంలో కోర్సును వీక్షించొచ్చు. కోర్సు పూర్తయ్యాకే డ్రైవింగ్ పరీక్షకు స్లాట్ బుకింగ్‌కు అనుమతిస్తారు. కాగా, కూకట్పల్లి పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి రానుందని పేర్కొన్నారు. కాగా, కూకట్ పల్లి ఆర్టీఓ పరిధిలో ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు 2,155 మంది నమోదు చేసుకోగా, వారిలో 1968 మంది కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు.
ఆన్లైన్లో పరీక్ష ఇలా !
ఎల్ఎల్ఆర్ పొందాలనుకుంటే సంబంధిత వివరాలతో దరఖాస్తుదారుడు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష విధానం మొత్తాన్ని వెబ్‌క్యామ్ ద్వారా ఏఐ నిఘా పర్యవేక్షిస్తుంది. పరీక్షకు లాగిన్ కాగానే అభ్యర్థి ముఖాన్ని సిస్టమ్ స్కాన్ చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న ఫొటోతో ఇది వందశాతం సరిపోలితేనే ఆ తర్వాత ఆప్షన్ చూపిస్తుంది. ఏ మాత్రం తేడా ఉన్నా ఓపెన్ కాదు. కేవలం ఫొటో పెట్టి మోసగించే ప్రయాత్నాలను అడ్డుకోవడానికి అభ్యర్థిని పలురకాలుగా పరీక్షించనుంది. ఐదు సార్లు నవ్వడం, ఐదుసార్లు కంటిరెప్పలాడించడంలాంటి నిబంధనలు పెట్టారు. వీటిలో అభ్యర్థి రైట్ పర్సన్ అని కంప్యూటర్ భావిస్తే మరో ఆప్షన్ చూపిస్తుంది. పరీక్ష రాస్తున్నంత సేపు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫ్రేమ్‌లోకి వేరే వ్యక్తి వచ్చినా, అభ్యర్థి కెమెరా పక్కకు తప్పుకున్నా సిస్టమ్ ఆటోమెటిక్‌గా పరీక్షను రద్దు చేస్తుంది.
అదనంగా గూగుల్ సెర్చ్ చేయడం లేదా ఇతర విండోన్ ఓపెన్ చేయడం కూడా యాక్సెప్ చేయదు. ఒకవేళ సాంకేతిక లోపాలతో ఫేస్ రికగ్నేషన్ ఫెయిల్ అయితే ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా నేరుగా ఆర్టీఓ ఆఫీసులో పరీక్ష రాసేందుకు కూడా వీలును రవాణా శాఖ కల్పించారు. పరీక్ష నిర్వహించబడిన వెంటనే ఉత్తీర్ణత వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. పాస్ అయిన వెంటనే డిజిటల్ సంతకం, క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎల్ఎల్ఆర్ పీడీఎఫ్ ఫార్మాట్‌తో నేరుగా మొబైల్‌కే వచ్చేస్తుంది. ఆ తర్వాత కాగా, ఇంగ్లీష్, తెలుగు, హిందీ మరియు ఉర్దూ భాషలలో రోడ్డు భద్రత వీడియోలు వీక్షించొచ్చని అధికారులు వివరించారు.
లైసెన్స్‌పై బ్లడ్‌గ్రూప్ !
2024లో దేశంలో దాదాపు 4.5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా, సుమారు 1.78 లక్షల మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. దాదాపు 80 శాతం ప్రమాదాలు డ్రైవర్ తప్పిదం వల్లే జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికంగా రక్తం అవసరం పడుతున్న సంఘటనలే ఉన్నాయి. కేంద్ర మోటార్ వాహనాల చట్టం ప్రకారం తెలంగాణ రవాణా శాఖ జారీ చేయనున్న కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లపై బ్లడ్ గ్రూప్, మొబైల్ నెంబర్లను ముద్రించనున్నారు. ఏదైన సమయంలో యాక్సిడెంట్ సంభవిస్తే సదరు వ్యక్తులకు అత్యవసర చికిత్సలో భాగంగా బ్లడ్ గ్రూప్ ఆధారంగా చికిత్స అందించే వీలును దృష్టిలో పెట్టుకొని ఈ తరహా విధానాలను తీసుకొస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

