తమిళనాడు మంత్రిగా ఉధయనిధి ప్రమాణస్వీకారం.. పోర్ట్ఫోలియో ఏదంటే..!
Udhayanidhi Stalin | డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) యువజన విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉధయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర మంత్రివర్గంలో
చెన్నై: డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) యువజన విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉధయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇవాళ ఉదయం తమిళనాడు రాజ్భవన్లో గవర్నర్ సీటీ రవి ఉధయనిధి చేత రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ సహా, పలువురు డిఎంకే నాయకులు హాజరయ్యారు. ఉధయనిధికి సీఎం స్టాలిన్ రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖను కట్టబెట్టినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గంలోకి ఉధయనిధిని తీసుకోవాలంటూ ఇటీవల డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసుకు గవర్నర్ సీటీ రవి ఆమోదం తెలిపారు.
తమిళ నటుడు, నిర్మాత, పంపిణీదారుడు అయిన ఉధయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి కూడా అయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

