MK Stalin | తమిళనాడు ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్లో ఆమోదించండి: సీఎం ఎంకే స్టాలిన్
MK Stalin | తమిళనాడు ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్లో ఆమోదించాలని సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర నిర్దిష్ట ప్రాజెక్టులను క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
చెన్నై: తమిళనాడు ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్లో ఆమోదించాలని సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ (MK Stalin) చేశారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర నిర్దిష్ట ప్రాజెక్టులను క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లుగా చెన్నై మెట్రో రైలు (ఫేజ్ 2) ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు విడుదల చేయలేదని స్టాలిన్ ఆరోపించారు. తాంబరం-చెంగల్పట్టు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే కారిడార్‌తోపాటు పెండింగ్‌లో ఉన్న ఇతర ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు.
కాగా, కేంద్ర బడ్జెట్‌పై తమిళ ప్రజల అంచనాలను సీఎం ఎంకే స్టాలిన్ హైలైట్ చేశారు. కోయంబత్తూరు, మదురైలో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆమోదం, తమిళనాడులో ఇప్పటికే ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులకు తగిన నిధుల కేటాయింపు, పీఎం ఆవాస్ అర్బన్, గ్రామీణ గృహ పథకాల వ్యయ పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరారు.
మరోవైపు సుమారు పదేళ్లుగా ఆదాయపు పన్ను భారం తగ్గుతాయని, తమకు పన్ను రాయితీలు లభిస్తాయని మధ్య తరగతి కుటుంబాలు ఆశిస్తున్నాయని సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని తాను నమ్ముతున్నానని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

