నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకోండి
భద్రతా నిబంధనలను ఉల్లంఘించే స్లీపర్ కోచ్ బస్సులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది.
- స్లీపర్ బస్సులపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశం
న్యూఢిల్లీ : భద్రతా నిబంధనలను ఉల్లంఘించే స్లీపర్ కోచ్ బస్సులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు శనివారం లేఖలు రాసింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేపై అక్టోబర్ 14న జరిగిన స్లీపర్ కోచ్ బస్ అగ్ని ప్రమాదంపై దాఖలైన ఫిర్యాదుపై ఈ విధంగా స్పందించింది. ప్రజా రవాణా బస్సుల డిజైన్‌లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు.
డ్రైవర్ ఉండే క్యాబిన్, ప్రయాణికుల కంపార్ట్మెంట్ పూర్తిగా వేరుగా ఉంటున్నాయని, దీనివల్ల అత్యవసర సమయాల్లో సమాచారం ఇచ్చి, పుచ్చుకోవడానికి; సకాలంలో అగ్నిప్రమాదాలను గుర్తించడానికి అవకాశం ఉండటం లేదని తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదాలను ప్రస్తావిస్తూ, ఈ దుర్ఘటనల్లో మరణాలను నిరోధించగలిగి ఉండేవారని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, పుణెలోని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ డైరెక్టర్‌కు కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులిచ్చింది. ఈ ఆరోపణలపై రెండు వారాల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా భద్రతా ప్రమాణాలను పాటించేలా ఆదేశించాలని కోరింది. బాధితులకు, వారి కుటుంబాలకు నష్ట పరిహారం అందజేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

