Tajinderpal Singh : భారత స్టార్ షాట్ఫుటర్ తేజిందర్‌పాల్ సింగ్ తూర్(Tajinderpal Singh Toor) మరో సంచలనం సృష్టించాడు. 19 ఏండ్ల రికార్డు బద్ధలు కొట్టాడు. టెహ్రాన్‌లో జరుగుతున్న ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్ 2024లో పసిడి పతకం కొల్లగొట్టాడు. ఫైనల్లో 19.72 మీటర్ల దూరం విసిరి టైటిల్ నిలబెట్టుకోవడమే కాకుండా 19 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశాడు.
వికాస్ గౌడ్ 19.60 మీటర్ల దూరంతో 2005లో ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నమెంట్లో స్టార్ అథ్టెట్ ఎర్రాజీ జ్యోతి(Yerraji Jyothi) 60 మీటర్ల హర్డిల్స్ పోటీలో నేషనల్ రికార్డు బ్రేక్ చేసి పసిడి వెలుగులు విరజిమ్మింది. 1,500 మీటర్ల ఫైనల్లో హర్మిలన్ బైన్స్ మొదటి స్థానంలో నిలిచి దేశానికి గోల్డ్ మెడల్ అందించింది.
తేజిందర్‌పాల్ సింగ్
నిరుడు ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్(National Inter-State Senior Athletics Championships)లో ఒకేసారి ఆసియా, జాతీయ స్థాయి రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియంలో అతను షాట్ పుట్‌ను ఏకంగా 21.77 మీటర్ల దూరం విసిరాడు. దాంతో, ఆగష్టులో బుడాపెస్ట్(Budapest)లో జరుగనున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్(World Athletics Championships 2023) పోటీలకు తేజింజర్ అర్హత సాధించాడు.