పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్సుపై సస్పెన్షన్ కొనసాగింపు
ఆహార భద్రతా ప్రమాణాల అమలులో అధికారులు ఎలాంటి వివక్షకు తావివ్వకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
- ఆహార భద్రతా తనిఖీల్లో వివక్ష చూపొద్దు
- జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీచేయండి
- ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆహార భద్రతా ప్రమాణాల అమలులో అధికారులు ఎలాంటి వివక్షకు తావివ్వకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు సహా ఆహార పదార్థాల తయారీ, విక్రయాలతో సంబంధమున్న అన్ని సంస్థ ల్లో ఒకే విధమైన తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఆహార భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా జిల్లాస్థాయి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌ను ఆదేశించింది.
రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు లే కుండా ఆహార వ్యాపారాలు నిర్వహించేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ బ్రాంచ్ లైసెన్సుపై గ త నెల 28న విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు నిరాకరించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి తాము పొందిన లైసెన్సును అధికారులు సస్పెండ్ చేయడాన్ని సవాలుచేస్తూ ఆ సం స్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి.. పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపార పరిస్థితుల్లో మార్పు రానందున సస్పెన్షన్ ఉత్తర్వులను కొనసాగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

