ఫుడ్‌పాయిజన్‌తో 20 మందికి అస్వస్థత
దసరా పండుగ నేపథ్యంలో మాంసాహారం తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం తండాకు చెందిన ఐదారు కుటుంబాల వారు కలిసి ఆదివారం మేకను కోసి దావత్ చేసుకున్నారు.
- కామారెడ్డి జిల్లా అన్నారం తండాలో ఘటన
పిట్లం, అక్టోబర్ 19 : దసరా పండుగ నేపథ్యంలో మాంసాహారం తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం తండాకు చెందిన ఐదారు కుటుంబాల వారు కలిసి ఆదివారం మేకను కోసి దావత్ చేసుకున్నారు. మిగిలిన మాంసాన్ని సోమవారం వండుకుని తినగా, నలుగురు చిన్నారులు సహా 20 మంది అస్వస్థతకు గు రయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. 17 మంది తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ దవాఖానకు తీసుకెళ్లారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహారం, నీటి నమూనాలు పరీక్షలకు పంపించారు.
ఫైమా జాతీయ కార్యవర్గసభ్యుడిగా చాళుక్యరాజ్
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (ఫైమా) నూతన జాతీయ కార్యవర్గసభ్యుడిగా కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా పీజీ చేస్తున్న డాక్టర్ చాళుక్యరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫైమా జాతీయ బృందం ఆయనకు అధికారిక నియామకపత్రాన్ని సోమవారం అందజేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

