న్యూఢిల్లీ : బాణసంచాను పూర్తిగా బ్యాన్ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చేస్తే ప్రజల మతపరమైన మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నది. అదే సమయంలో 24 గంటలూ బాణసంచా కాల్చేందుకు అనుమతివ్వలేమని.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండుగలు జరుపుకునేందుకు ప్రజలకు నిర్దిష్టమైన సమయ పరిమితిని విధించాల్సిందేనని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం తెలిపింది.
ప్రజల మతపరమైన మనోభావాలు, ప్రజల ఆరోగ్యం, పర్యావరణం మధ్య సమతుల్యతలను పాటించాలని ధర్మాసనం వెల్లడించింది.