e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News మిస్త్రీకి ఎదురుదెబ్బ‌.. టాటాల‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు

మిస్త్రీకి ఎదురుదెబ్బ‌.. టాటాల‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: టాటా స‌న్స్ చైర్మ‌న్‌గా మ‌ళ్లీ సైర‌స్ మిస్త్రీని నియ‌మించాల‌న్న నేష‌న‌ల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ (ఎన్‌సీఎల్ఏటీ) తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. గ‌తేడాది జ‌న‌వ‌రి 10న ఎన్‌సీఎల్ఏటీ ఇచ్చిన ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన టాటా స‌న్స్‌కు అనుకూలంగా శుక్ర‌వారం తీర్పు వెలువ‌డింది. 2016, అక్టోబ‌ర్‌లో సైర‌స్ మిస్త్రీని టాటా స‌న్స్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తొల‌గించారు బోర్డు స‌భ్యులు. ఇది కార్పొరేట్ పాల‌న సూత్రాల ఉల్లంఘ‌నే అవుతుంద‌ని షాపూర్జీ ప‌ల్లోంజీ (ఎస్‌పీ) వాదించింది. అయితే ఇందులో ఉల్లంఘ‌న‌లు ఏవీ లేవ‌ని, మిస్త్రీని తొల‌గించే హ‌క్కు బోర్డుకు ఉన్న‌ద‌ని టాటా గ్రూప్ వాదించింది.
టాటాల వాద‌న‌తో సుప్రీంకోర్టు ఏకీభ‌వించింది. ఇక షేర్ల విష‌యాన్ని మ‌రో న్యాయ ప్ర‌క్రియ‌లో తేల్చుకోవాల‌ని కూడా టాటా గ్రూప్‌, సైర‌స్ మిస్త్రీల‌కు సుప్రీంకోర్టు సూచించింది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం టాటా గ్రూప్‌కు అనుకూలంగా తీర్పు వెలువ‌రించింది. 2012లో ర‌త‌న్ టాటా త‌ర్వాత టాటా స‌న్స్ చైర్మ‌న్ అయిన సైర‌స్ మిస్త్రీని 2016లో బోర్డు తొల‌గించింది. టాటా స‌న్స్‌లో మిస్త్రీ కుటుంబానికి 18.37 శాతం వాటా ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement