హిజాబ్ బ్యాన్.. కర్నాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై కర్నాటక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని వేసిన పిటిషన్లను కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ హేమంత గుప్తా, సుధాన్షు దులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. హిజాబ్ బ్యాన్ ఎత్తివేత అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మళ్లీ సెప్టెంబర్ 5వ తేదీన విచారించనున్నట్లు కోర్టు తెలిపింది. క్లాస్‌రూమ్‌లో హిజాబ్ ధరించే అనుమతి ఇవ్వాలని ఉడిపిలోని ప్రభుత్వ కాలేజీ ముస్లిం అమ్మాయిలు కర్నాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders | ‘ర్యాలీ వాయిదాకు మీరైనా ఒప్పించండి’.. ఢిల్లీ వ్యాపారులు
Gyanesh Kumar | జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే.. మాక్ పార్లమెంట్ డిమాండ్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని సిరిసిల్ల నుంచి వేములవాడకు పాదయాత్ర
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

