Karnataka Hijab ban: హిజాబ్ వివాదంపై సుప్రీంలో భిన్నాభిప్రాయాలు..
Karnataka Hijab ban: ముస్లిం విద్యార్థినిలు కాలేజీల్లో హిజాబ్‌ను ధరించరాదు అని కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాల
న్యూఢిల్లీ: ముస్లిం విద్యార్థినిలు కాలేజీల్లో హిజాబ్‌ను ధరించరాదు అని కర్నాటక ప్రభుత్వం(Karnataka Hijab ban:) ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వినిపించారు. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కర్నాటక ప్రభుత్వ హిజాబ్ నిషేధ ఆదేశాలను జస్టిస్ హేమంత్ గుప్తా స్వాగతించారు. ఇక ఆ ధర్మాసనంలో ఉన్న మరో న్యాయమూర్తి సుధాన్షు దులియా మాత్రం ప్రభుత్వ ఆదేశాలను కొట్టిపారేశారు.
ఈ కేసులో భిన్నాభిప్రాయం ఉందని, అందుకే అప్పీల్‌ను డిస్మస్ చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. ఇక జస్టిస్ దులియా మాత్రం అప్పీల్‌ను ఆమోదిస్తూ, కర్నాటక ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేశారు. అమ్మాయిలకు విద్యను అందించడమే తనకు ప్రాముఖ్యమైన విషయమని, అయితే హిజాబ్‌ను నిషేధించడం వల్ల ఆ అమ్మాయిల జీవితాలు బాగుపడుతాయా అని జస్టిస్ దులియా ప్రశ్నించారు.
కర్నాటక హిజాబ్ వివాదాన్ని ఇప్పుడు మరింత విస్తృత ధర్మాసనం విచారించనున్నది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఈ కేసును సీజేఐ ముందుకు తీసుకువెళ్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక హిజాబ్ వివాదంపై జస్టిస్ గుప్తా స్పందిస్తూ మొత్తం 11 ప్రశ్నలను లేవనెత్తారు.
ఇస్లాం ప్రకారం హిజాబ్‌ను ధరించడం మతపరంగా అత్యవసరం ఏమీ కాదు అని, ప్రభుత్వ ఆదేశాలు సరిగ్గానే ఉన్నట్లు జస్టిస్ గుప్తా తెలిపారు. ఆ కారణాల చేత అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నాటక హైకోర్టు ఈ కేసులో తప్పుడు విధానంలో వెళ్లినట్లు జస్టిస్ దులియా తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

