రాకెట్‌ను విసిరికొడితే!

- ఇంధనం మండించకుండానే రోదసిలోకి ఉపగ్రహాలు
- ‘వినూత్న లాంచర్’ను తీసుకొచ్చిన అమెరికా స్టార్టప్
- సూపర్‌సానిక్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాతో రూపకల్పన
- పర్యావరణ హితంతో పాటు రాకెట్‌ను మళ్లీ వాడుకోవచ్చు
ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడానికి వ్యోమనౌకలను (రాకెట్లను) వినియోగిస్తామన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియలో పెద్దమొత్తంలో ఇంధనం ఖర్చు కావడంతో పాటు వాతావరణంలోకి టన్నుల కొలదీ కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. దీనికి పరిష్కారంగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ స్పిన్‌లాంచ్ ‘ప్రత్యామ్నాయ స్పేస్‌క్రాఫ్ట్ లాంచర్’ను తీసుకొచ్చింది. ప్రాజెక్టులో భాగంగా గతనెల 22న చేసిన ముందస్తు ప్రయోగం కూడా విజయవంతమైంది.
ఏమిటీ ప్రత్యామ్నాయ లాంచర్?
ఇంధనాన్ని మండించి రోదసిలోకి రాకెట్‌ను పంపించడానికి బదులు.. శూన్యంతో నింపిన అపకేంద్రక యంత్రం (ప్రత్యామ్నాయ లాంచర్)లో వ్యోమనౌకను ప్రవేశపెడతారు. వృత్తాకారంగా ఉండే ఈ భారీ నిర్మాణంలోని రొటేటింగ్ ఆర్మ్ వ్యవస్థ ధ్వని వేగం కంటే ఎన్నోరెట్లు ఎక్కువ వేగంతో (సూపర్‌సానిక్ వేగం) తిరుగుతూ.. రాకెట్‌ను ఆకాశంలోకి విసురుతుంది. కైనెటిక్ ఎనర్జీ (గతిశక్తి) సూత్రం ఆధారంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
రాకెట్ ప్రయోగం ఇలా..
- ‘ప్రత్యామ్నాయ లాంచర్’లో రాకెట్‌ను ప్రవేశపెట్టడం
- ధ్వని వేగంకంటే ఎన్నో రెట్లు ఎక్కువ వేగంతో రాకెట్‌ను తిప్పడం
- ఇంధనాన్ని వాడకుండా రాకెట్ ప్రయాణానికి అవసరమైన వేగాన్ని అందించడం
- కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాక, బెలూన్‌తో రాకెట్ తిరిగి భూమికి చేరుకోవడం
- ఇంధనం గది అవసరంలేక పోవడంతో పెద్ద ఉపగ్రహాలను కూడా రాకెట్ మోసుకెళ్లే సౌలభ్యం
లాభాలేంటి?
- ‘ప్రత్యామ్నాయ లాంచర్’ సాయంతో చేసే ప్రయోగాల్లో రాకెట్ ఫ్యూయెల్‌ను మండించే అవసరంలేదు. దీంతో పర్యావరణ కాలుష్యానికి ఆస్కారమేలేదు. రొటేటింగ్ ఆర్మ్‌ను వినియోగించడంవల్ల రాకెట్‌కు ఇంధనం అవసరం ఉండదు. దీంతో తక్కువ ఖర్చులోనే వ్యోమనౌకను రోదసిలోకి పంపించవచ్చు.
- రాకెట్ నిర్మాణంలో ఎక్కువ భాగం ఫ్యూయెల్ గదికే కేటాయిస్తారు. అయితే, ‘ప్రత్యామ్నాయ లాంచర్’తో పంపుతుండటంతో రాకెట్లకు ప్రత్యేకంగా ఫ్యూయెల్ గదిని నిర్మించాల్సిన అవసరంలేదు. దీంతో చిన్న సైజులో, తక్కువ ఖర్చుతోనే రాకెట్ నిర్మాణాన్ని పూర్తిచేయవచ్చు. పెద్ద ఉపగ్రహాలను రోదసిలోకి పంపే వీలుకలుగుతుంది.
- సాధారణ రాకెట్ ప్రయోగంలో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టగానే వ్యోమనౌక భాగాలు రోదసిలో మండిపోతాయి. లేదా సముద్రంలో కూలిపోతాయి. అయితే, ‘ప్రత్యామ్నాయ లాంచర్’ సాయంతో ప్రయోగించే రాకెట్‌ను పునర్వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన అనంతరం రాకెట్ తిరిగి భూమిని చేరుకోవడానికి భారీ గ్యాస్ బెలూన్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
- లాంచర్ సాయంతో పంపిన రాకెట్ నిర్ణీత కక్ష్యవరకు చేరుకోకపోతే.. ముందస్తుగా అమర్చిన ఫ్యూయెల్ ఇంజిన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని నుంచి వెలువడే కాలుష్యం కూడా చాలా తక్కువ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

