అభివృద్ధి, సంక్షేమానికి అండగా ఉండాలి: మంత్రి సత్యవతి రాథోడ్
ఈ ప్రాంత అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

ఇల్లందు: ఈ ప్రాంత అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసేందుకు నేతలంతా కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అధ్యక్షతన జరిగిన పార్టీ సంస్థాగత సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి నేతలు గులాబీ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తీసుకున్నదని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న హరిప్రియ నాయక్ కూడా టీఆర్ఎస్ లో చేరిన విషయం మనందరికీ తెలిసిందేనని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గ్రామ కమిటీల్లో అవకాశం లభించకపోతే.. మండల కమిటీల్లో అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ఎమ్మెల్యేదే బాధ్యత అని సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అనుభవాన్ని అందరూ స్వీకరించాలని, మనమంతా కలిసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నరేశ్ రెడ్డి, తాత మధు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, జిల్లా నేతలు దిండిగల రాజేందర్, వేణు, హరిసింగ్, వీవీ, జానీ పాల్గొన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

