శాస్త్రోక్తంగా శ్రీ శుక్లాదేవి అర్చనం..

తిరుపతి, జూన్ 18: లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ఠ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ శుక్లాదేవి అర్చనం శాస్త్రోక్తంగా జరిగింది. వర్సిటీలోని యాగశాలలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. పురాణాల ప్రకారం శ్రీ పార్వతీ దేవి శక్తి స్వరూపాలలో శ్రీ శుక్లాదేవి ఒకరు. గ్రీష్మ ఋతువులో తొలకరి వానలు సరిగా కురిసి, మంచి పాడిపంటలతో సకల మానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ శ్రీ శుక్లాదేవిని అర్చించారు. ముందుగా తెల్లటి వస్త్రాలు, తెల్లటి పుష్పాలు ధరించిన శ్రీ శుక్లాదేవి అమ్మవారి చిత్రపటాన్ని కొలువుదీర్చి ఆవాహన చేశారు.
అనంతరం వర్సిటీ ఆచార్యులు గోలి వెంకటసుబ్రహ్మణ్యశర్మ అమ్మవారి ప్రాశస్త్యాన్ని వివరించారు. భవిష్య, నారద పురాణాల ప్రకారం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో శ్రీ శుక్లాదేవి ఆరాధన నిర్వహిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం పరిపూర్ణంగా లభించడమే గాక సమస్త ఈతిబాధలు నశిస్తాయని తెలిపారు. ఆ తరువాత వైదిక సంప్రదాయంలో శ్రీసూక్తపూర్వకంగా సంకల్పం, గణపతిపూజ, శ్రీ శుక్లాదేవి అర్చనం, అష్టోత్తరశతనామావళి పఠించారు. పలు నివేదనలు, నీరాజనాలు అందించిన అనంతరం క్షమాప్రార్థనతో ఈ పూజ ముగిసింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు దేవీ సంకీర్తనలు ఆలపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

