Sreeleela | బాలీవుడ్లో బంపరాఫర్.. శ్రీలీల జాతకాన్ని మార్చేసిన ఐటెంసాంగ్
‘పుష్ప-2’లో ఐటెంసాంగ్ ‘కిస్సిక్' కథానాయిక శ్రీలీల జాతకాన్నే మార్చివేసింది. ముఖ్యంగా ఈ పాటతో ఉత్తరాది యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుందీ అమ్మడు. దీంతో బాలీవుడ్ వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే యువహీరో ఇబ్రహిమ్ అలీఖాన్ సరసన ఓ చిత్రంలో నాయికగా నటిస్తున్నది శ్రీలీల.
Sreeleela | ‘పుష్ప-2’లో ఐటెంసాంగ్ ‘కిస్సిక్’ కథానాయిక శ్రీలీల జాతకాన్నే మార్చివేసింది. ముఖ్యంగా ఈ పాటతో ఉత్తరాది యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుందీ అమ్మడు. దీంతో బాలీవుడ్ వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే యువహీరో ఇబ్రహిమ్ అలీఖాన్ సరసన ఓ చిత్రంలో నాయికగా నటిస్తున్నది శ్రీలీల. ఆమెకిది తొలి హిందీ చిత్రం.
తాజాగా ఈ భామ బాలీవుడ్లో భారీ ఆఫర్‌ను దక్కించుకుంది. అగ్ర హీరో కార్తిక్ ఆర్యన్ సరసన కథానాయికగా నటించనుంది. అనురాగ్‌బసు దర్శకత్వం వహిస్తారు. తొలుత త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఎంపిక చేయగా..చివరి నిమిషంలో ఆమెను తప్పించి శ్రీలీలను ఖరారు చేశారు. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘ఆషికీ-3’లో అవకాశం రావడం పట్ల శ్రీలీల ఆనందం వ్యక్తం చేసింది. బాలీవుడ్లో తన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

