టీకాల ఉత్పత్తి పెంచకపోతే 2024 దాకా కరోనా

లండన్: జీ-7 దేశాలు టీకా ఉత్పత్తి పెంచకపోతే కరోనా 2024 వరకు పోయే ప్రసక్తే లేదని ఫ్రాన్స్ విదేశాంగమంత్రి జాన్-ఈవ్స్ లెడ్రియాన్ హెచ్చరించారు. పేటెంట్ ల గురించి ఇప్పుడు చర్చ నడుస్తున్నది కానీ టీకాల ఉత్పత్తి పెంచడం అంతకన్నా ముఖ్యం అని ఆయన అన్నారు. లండన్లో జీ-7 విదేశాంగమంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, పేదదేశాలకు కరోనా టీకాలు సత్వరమే అందాల్సిన అవసరముందని, అందులో సంపన్న దేశాల కూటమి అయిన జీ-7 బాధ్యత చాలా ఉంటుందని లెడ్రియాన్ గుర్తు చేశారు. ప్రస్తుత టీకాల ఉత్పత్తి వేగం ఇదే తీరున నత్తనడకన సాగితే 2024 దాకా కరోనా పోదని నొక్కిచెప్పారు. అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ ను ప్రచార సాధనంగా వాడుకుంటున్నాయని ఫ్రాన్స్ విదేశాంగమంత్రి విచారం వ్యక్తం చేశారు. లక్షల డోసులు తెచ్చి విమానాశ్రయాల్లో దింపి వెళ్లిపోతున్నాయని, సంఘీభావం అంటూ, మంచితనమంటూ చెప్పుకుంటున్నాయని అన్నారు. ఈ తరహా ప్రచారాలకు దూరంగా ఉండడం మంచిదని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

