Karnataka | కర్నాటకకు రణదీప్ సుర్జేవాలా.. ముఖ్యమంత్రి మార్పు తప్పదా..?
Karnataka | కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సోమవారం కర్నాటకలో పర్యటిస్తున్నారు. బెంగళూరులో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సుర్జేవాలా పర్యటన నేపథ్యంలో కలక మార్పులు జరగవచ్చన్న ప్రచారం జరుగుతుంది.
Karnataka | కాంగ్రెస్ ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సోమవారం కర్నాటకలో పర్యటిస్తున్నారు. బెంగళూరులో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సుర్జేవాలా పర్యటన నేపథ్యంలో కలక మార్పులు జరగవచ్చన్న ప్రచారం జరుగుతుంది. అయితే, ఆయన పర్యటన కన్నడ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో హోం మంత్రి జీ పరమేశ్వర సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. రణదీప్ సుర్జేవాలా పర్యటన గురించి తనకేం తెలియదన్నారు. ఆయన పర్యటనపై ప్రశ్నించగా.. జిల్లా పంచాయతీ, తాలూక పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన వాటిపై చర్చించే అవకాశం ఉందన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సమయంలో చాలాసార్లు హైకమాండ్ జోక్యం చేసుకుంటుందని.. ఇది వారి పనేనన్నారు.
అయితే, కర్నాటక కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా నాయకత్వ మార్పు చర్చ జరుగుతుండడం విశేషం. ముఖ్యమంత్రి పీఠంపై డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య మధ్య రెండున్నరేళ్లు ఉంటారన్న ఊహాగానాలు రాగా.. ఈ నేపథ్యంలో సుర్జేవాలా పర్యటన ఆసక్తికరంగా మారింది. డీకే శివకుమార్ త్వరలోనే కర్నాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పలు నివేదికలు తెలిపాయి. రణదీప్ సుర్జేవాలా, పార్టీలో మార్పులపై సిద్ధరామయ్యను ప్రశ్నించగా.. తమ ప్రభుత్వం బలంగా ఉందన్నారు. పూర్తిస్థాయిలో ఐదేళ్లు కొనసాగుతుందన్నారు. మనందరం కలిసి నడుస్తామన్నారు. పార్టీని గాడిన పెట్టేందుకు సుర్జేవాలా రాష్ట్రానికి వస్తున్నారు.
డీకే శివకుమార్ తాను ఇద్దరం కలిసే ఉన్నామని.. అబద్ధాలను వ్యాప్తి చేయడంలో బీజేపీ ప్రసిద్ధి చెందిందని విమర్శించారు. ఇదిలా ఉండగా మంత్రి కేఎస్ రాజన్న ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నాటక, జాతీయ రాజకీయాల విషయానికి వస్తే సెప్టెంబర్ తర్వాత పెద్ద మార్పులుంటాయన్నారు. 75 సంవత్సరాలు నిండిన వారు ప్రభుత్వ పదువులు నిర్వహించలేరని గుర్తుంచుకోవాలని.. ఇది బీజేపీ, సంఘ్ విధానమన్నారు. దాంతో దేశానికి కొంత ప్రధాని రావొచ్చని.. కర్నాటక కాంగ్రెస్ పార్టీలో కూడా మార్పు డిమాండ్ ఉందని.. చాలా మంది మంత్రులు కావాలని కోరుకుంటున్నారన్నారు. చాలా మందికి వారి సొంత ఎజెండాలున్నాయని.. అవి సెప్టెంబర్ తర్వాత రూపుదిద్దుకుంటాయని రాజన్న పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

