పార్టీలో పాటకు స్టెప్పులు.. అదరగొట్టిన ఐపీఎస్ అధికారులు

న్యూఢిల్లీ: సాధారణంగా సీఐ, ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులే విధి నిర్వహణలో గంభీరంగా, సీరియస్‌గా కనిపిస్తుంటారు. అదే ఐపీఎస్ అధికారుల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, అంత సీరియస్‌గా కొంచెం సరదాగా కనిపించినా చూసేవాళ్లకు విచిత్రంగా అనిపిస్తుంది. అలాంటిది ఐపీఎస్ అధికారులు ఏకంగా డ్యాన్స్ చేస్తే ఎలాంటి ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా..? తాజాగా దేశ రాజధాని డిల్లీలో అలాంటి ఘటనే జరిగింది.
ఢిల్లీలో ఓ పార్టీకి హాజరైన ఇద్దరు ఐపీఎస్ అధికారులు సింగర్ సప్న చౌదరి పాటకు స్టెప్పులు వేసి పార్టీలో ఉన్నవారిని ఉత్సాహపరిచారు. ప్రస్తుతం వారి డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వీడియోను చూసిన నెటిజన్లు అధికారుల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎస్ అధికారులు ఆర్కే విజ్, దిపాన్షు కబ్రాలు ఇటీవల ఢిల్లీలో ఓ పార్టీకి వెళ్లారు. ఆ పార్టీలో సప్న చౌదరి పాడిన ‘గజ్బాన్ పానీ లే చలి’ అనే పాటకు వీరిద్దరూ కలిసి స్టెప్పులేశారు.
వారి డ్యాన్స్ వీడియోను డాక్టర్ మోనికాసింగ్ అనే మహిళ శనివారం ట్విట్టర్లో షేర్ చేసింది. ఎస్పీ మహోదయ్తో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఇన్స్పెక్టర్ మహోదయ్.. సూపర్’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇప్పటివరకు వీడియోకు 40 వేలకు పైగా వ్యూస్, వేలల్లో కామెంట్లు వచ్చాయి. అద్భుతమైన డ్యాన్స్.. సూపర్ స్టెప్పులు అంటూ నెటిజన్లు వారిని మెచ్చుకుంటున్నారు. విధుల్లో లేనప్పుడు వారు కూడా సాధారణ పౌరులే.. అందరిలాగే వాళ్లకు కూడా సరదాగా గడిపే హక్కు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

