హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్సీఏ టీ20 లీగ్లో సౌత్ సెంట్రల్ రైల్వేస్ జట్టు ఆటగాడు నిహాల్ రెడ్డి (42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74) ఫిఫ్టీతో సత్తా చాటాడు. దాంతో రైల్వేస్ ఒక వికెట్ తేడాతో కంబైన్డ్ డిస్ట్రిక్ట్-2జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది.
నెక్స్జెన్ క్రికెట్ అరేనాలో జరిగిన ఈమ్యాచ్లో తొలుత కంబైన్డ్ డిస్ట్రిక్ట్ జట్టు 19 ఓవర్ల 171/3 స్కోరు చేసింది. అనంతరం నిహాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో రైల్వేస్ 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం అందుకుంది. కెప్టెన్ సిగినేని ధృవ కుమార్రెడ్డి (20) కూడా రాణించాడు.