సఫారీలదే టెస్టు సిరీస్
పుష్కరకాలంగా సౌతాఫ్రికా గడ్డపై అందని టెస్టు సిరీస్ విజయాన్ని ఈసారి చేజిక్కించుకోవాలనుకున్న ఆస్ట్రేలియా ఆశలు అడియాసలే అయ్యాయి.
- బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం
కేప్‌టౌన్: పుష్కరకాలంగా సౌతాఫ్రికా గడ్డపై అందని టెస్టు సిరీస్ విజయాన్ని ఈసారి చేజిక్కించుకోవాలనుకున్న ఆస్ట్రేలియా ఆశలు అడియాసలే అయ్యాయి. ఇరుజట్ల మధ్య రోజురోజుకూ ఆధిక్యం చేతులు మారుతూ రసవత్తరంగా సాగిన మూడో టెస్టులో సఫారీ బౌలర్ల విజృంభణతో కంగారూలు తోక ముడిచారు. 288 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు క్రీజులోకి వచ్చిన ఆసీస్.. సిమోన్ హర్మర్ (6/16) స్పిన్ మాయకు తోడు కగిసొ రబాడా (3/39) పేస్ దెబ్బకు 111 పరుగులకే కుప్పకూలింది.
తద్వారా సౌతాఫ్రికా 176 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. రబాడా ఆసీస్ టాపార్డర్ పనిపట్టగా హర్మర్ కమిన్స్ సేనకు కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. నాథన్ లియాన్ (33 నాటౌట్) ఆదుకోకుంటే ఆసీస్ వంద లోపే ఆలౌట్ అయ్యేది. ఆస్ట్రేలియా జట్టు సఫారీ గడ్డపై చివరిసారి 2014లో టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న తర్వాత కంగారూలకు ప్రతి సిరీస్‌లోనూ ఓటములే ఎదురయ్యాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

