చండీగఢ్, జనవరి 10: సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్దూ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. రాష్ట్రంలోని మోగా జిల్లాలో ఉన్న సోనూసూద్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.