Sonia Gandhi । సోనియా నేతృత్వంలో నేడు విపక్ష పార్టీ నేతల భేటీ
Sonia Gandhi । సోనియా నేతృత్వంలో నేడు విపక్ష పార్టీ నేతల భేటీ |

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో శుక్రవారం విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. సమావేశంలో 15 పార్టీలు పాల్గొననుండగా.. ఇవాళ సాయంత్రం వర్చువల్ విధానంలో భేటీ జరుగనుంది. బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద పవార్ సహా ఆయా పార్టీల నేతలు పాల్గొనున్నారు. సమావేశానికి ఆమ్ ఆద్మీ, బహుజన సమాజ్ పార్టీలను ఆహ్వానం అందలేదు. బెంగాల్ సీఎం మమత ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా సోనియా సహా పలువురు నేతలను కలిశారు. అనుకున్నంతగా ప్రతిపక్షం బలహీనంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంగా భేటీ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ పెగాసస్ కుంభకోణం, రైతుల ఆందోళన, ద్రవ్యోల్బణం తదితర సమస్యలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి.
ప్రతిపక్షాల నిరసనతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్ని మధ్య ఈ విషయంలో సమన్వయంతో ముందుకెళ్లి కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు ముందుగా నిర్ణయించిన గడువు కంటే రెండు రోజుల ముందే ముగిసిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగే భేటీలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు వచ్చే ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించే అంశంపై అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

