తిరుమల బ్రహ్మోత్సవాలు.. శోభాయమానంగా తిరుమంజనం
TTD Annual Brahmotsavam | బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిసారిగా పటికబెల్లం, కివిపండ్లు, ఎరువు పవిత్ర మాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో

తిరుమల : బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిసారిగా పటికబెల్లం, కివిపండ్లు, ఎరువు పవిత్ర మాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ వాసుదేవ భట్టాచార్యులు కార్యక్రమం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో కురువేరు, తెల్లపట్టు, రంగురంగుల ఎండుఫలాలు, వట్టివేరు, పసుపు రోజామాలలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి అలంకరించారు.

వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చకస్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. శోభాయమానంగా సాగిన ఈ స్నపన తిరుమంజనాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. తిరుపూర్‌కు చెందిన చెందిన దాత రాజేందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు, హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, శ్రీధర్ సహకారంతో రంగనాయకుల మండపం అలంకరణ చేశామని టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి దంపతులు, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

