స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలా..? రోజూ అయితే ఇలా చేయండి

మద్యపానం, ధూమపానంతోపాటు జంక్‌ఫుడ్ అధికంగా తినడం కూడా ఓ వ్యసనమేనని సైంటిస్టులు ఇది వరకే చెప్పారు. అయితే ఈ అలవాట్లను ఎవరూ అంత త్వరగా మానలేరు. ఎంత వద్దనుకున్నా వాటిని తీసుకుంటూనే ఉంటారు. అయితే అలాంటి వారు నిత్యం పచ్చని ప్రకృతి వాతావరణంలో కొంత సేపు గడిపితే ఆ అలవాట్ల నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
నిత్యం మద్యం సేవించేవారు, పొగ అధికంగా తాగేవారు, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినేవారు ఆయా అలవాట్ల నుంచి బయటపడాలంటే.. నిత్యం పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంత సేపు గడిపితే చాలని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు.. నేచురల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ కార్వింగ్: ది మెడియేటింగ్ రోల్ ఆఫ్ నెగెటివ్ అఫెక్ట్.. అనే ఓ అధ్యయనంలో సైంటిస్టులు వివరాలను వెల్లడించారు.
పచ్చని ప్రకృతిలో నిత్యం గడపడం వల్ల చెడు అలవాట్ల వైపు ఎవరూ ఆకర్షితులు కారని, వాటివైపు చూడడం మానేస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. దీని వల్ల ఆయా వ్యసనాల నుంచి సులభంగా బయట పడవచ్చని వారు అంటున్నారు. కనుక ఎవరైనా సరే.. నిత్యం కొద్ది సేపు పచ్చని ప్రకృతిలో గడిపితే చెడు అలవాట్ల బారి నుంచి తప్పించుకోవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

