బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది. శారీరకంగా బలంగా ఉంటూనే బరువును నియంత్రణలో ఉంచుకోవాలంటే, స్కిప్పింగ్కు మించిన మార్గం లేదు. స్కిప్పింగ్ వల్ల శరీరానికి మన్నిక, గుండె కండరాలకు బలం. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆయుః ప్రమాణంతోపాటు మొత్తంగా ఫిట్నెస్ పెరుగుతుంది.
మిగతా వ్యాయామాలతో పోలిస్తే, రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల తొందరగా బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో పేరుకుపోయిన క్యాలరీలను వదిలించుకోవడానికి స్కిప్పింగ్ మంచిదంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఒక నిమిషంపాటు స్కిప్పింగ్ చేయడం వల్ల 10 నుంచి 16 కిలో క్యాలరీలు ఖర్చయిపోతాయి. పది నిమిషాలకోసారి విరామం ఇస్తూ, ఓ అరగంట స్కిప్పింగ్ చేస్తే 480 కిలో క్యాలరీలు కరిగిపోతాయన్న మాట. అయితే అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవాళ్లు స్కిప్పింగ్కు దూరంగా ఉండాలి. సున్నితంగా, పదేపదే ఎగరడం వల్ల పాదాలపై ఒత్తిడి తక్కువగా పడుతుంది. దాంతో పాదాల స్థిరత్వం మెరుగవుతుంది. శరీర భాగాల్లో సమన్వయం, చురుకుదనం పెరుగుతుంది. స్కిప్పింగ్తో శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది. పిల్లల్లో అయితే శరీరాకృతి తీర్చిదిద్దినట్లుగా తయారవుతుంది .