Road Accident : కర్ణాటక (Karnataka) సరిహద్దుల్లో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. బాగేపల్లి (Bagepalli) సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ (Container Lorry) ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో (Auto) లో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పాట్‌కు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానికులు, పోలీసులు బాగేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, గాయపడిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదంతో బాగేపల్లి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.