SIP Stock Investments | తెలివైన వ్యూహం

ఎస్ఐపీ పద్ధతిలో స్టాక్ పెట్టుబడులతో అధిక రాబడులు
గత రెండు దశాబ్దాలుగా స్టాక్మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వీరిలో చాలామంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడనివారే. స్వల్పకాలిక ట్రేడర్లు మార్కెట్ ఒడిదుడుకులను ఒడిసి పట్టుకుని లాభాలను ఆర్జించడం సాధ్యమే. కానీ దీర్ఘకాల ఇన్వెస్టర్లలో
చాలామందికి మార్కెట్లో సరైన సమయంలో మదుపు చేయడంలో నైపుణ్యం తక్కువే. ఇందుకు మార్కెట్ కదలికలను అంచనా వేయగలగాలి. చాలామంది ఇన్వెస్టర్లు సెంటిమెంట్లకు, మార్కెట్ పరిణామాలకు ప్రభావితం అవుతారు. ఇలాంటి సమయంలో మార్కెట్ ట్రెండ్‌తో సంబంధం లేకుండా దీర్ఘకాలానికి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) పద్ధతిలో మదుపు చేయడం వల్ల అధిక రాబడులను సాధించవచ్చు.
అనుసరిస్తూ మార్కెట్లో కొనుగోలు, అమ్మకం చేసే స్థాయిలను గుర్తించడంలో ఇన్వెస్టర్లు పొరబాట్లు చేస్తుంటారు. అదే ఎస్ఐపీ పద్ధతిలో మదుపు చేయడం వల్ల మార్కెట్ పతనంలో అధిక షేర్లు రావడం వల్ల మనకు సగటు ధర ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది. అలాగే మార్కెట్ ఉత్థాన పతనాలు ఎస్ఐపీ ఇన్వెస్ట్మెంట్లకు సానుకూలంగా మారతాయి. పతనంలో మనం చేసే ఎస్ఐపీ మొత్తానికి అధిక షేర్లు రావడం వల్ల మార్కెట్ పెరిగినప్పుడు రాబడి అధికంగా ఉంటుంది. అధిక రాబడులతోపాటు పన్ను ఆదా కూడా చేయవచ్చు. ట్రెండ్‌ను అధిగమించి ఒకేసారి మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆకస్మిక పతనాల్లో బెంబేలు పడటం కన్నా.. మార్కెట్ పతనంలోనూ రాబడులు స్థిరంగా ఉండే ఈ పద్ధతిలో పెట్టుబడులు మనశ్శాంతిని చేకూరుస్తాయి.
ఎస్ఐపీ అంటే?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా పాపులర్. మ్యూచువల్ ఫండ్లకు బదులుగా జాగ్రత్తగా ఎంపిక చేసిన షేర్లలో మదుపు చేస్తే అధిక రాబడులను సాధించవచ్చు. ఎంపిక చేసుకున్న షేర్లలో ప్రతి నెలా లేదా కొంత మొత్తాన్ని మదుపు చేసే పద్ధతిని అవలంభించడమే ఎస్ఐపీ. ఈ పద్ధతిలో మన సగటు ధర ఎప్పుడూ మార్కెట్ ధర కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి మదుపు చేయడం కన్నా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మదుపు చేయడం వల్లనే అత్యధిక రాబడులు వస్తున్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలాసార్లు ట్రెండ్‌ను
ఎలాంటి స్టాక్స్
ఎస్ఐపీ ద్వారా దీర్ఘ కాలానికి మదుపు చేస్తున్నాం కనుక తక్కువ ఒడిదుడుకులకు లోనయ్యే షేర్లను ఎంపిక చేసుకోవాలి. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్ఓఈ) కనీసం 17 శాతం ఉండి, అమ్మకాల్లోనూ, నికర లాభాల్లోనూ గత నాలుగు త్రైమాసికాల్లో 20 శాతం వృద్ధిని నమోదు చేసిన కంపెనీల షేర్లను ఎంపిక చేసుకోవాలి. అలాగే రుణ భారం లేని కంపెనీలు, ప్రమోటర్ల వాటా అధికంగా ఉన్న కంపెనీల షేర్లను ఎంపిక చేసుకోవాలి. వీటిలో కొన్ని సగటు రాబడులు, మరికొన్ని మల్టిబ్యాగర్లు అయ్యే అవకాశం ఉంటుంది.
ఎంత కాలం?
సాధారణంగా దీర్ఘకాలం అంటే ఐదేండ్లుపైబడి. కానీ ప్రస్తుతం దీర్ఘకాలం అంటే చాలా మందికి ఏడాదే. కానీ మార్కెట్లో సైకిల్స్ రెండు, నాలుగు, ఎనిమిదేండ్లు ఉన్నాయి. ప్రతి రెండేండ్లకోసారి మార్కెట్ కరెక్షన్ సహజం. అలాగే బుల్ మార్కెట్ సైకిల్ నాలుగు, ఎనిమిదేండ్ల వరకు ఉంటుంది. ఈ సైకిల్స్‌కు అనుగుణంగా నాలుగు లేదా ఐదేండ్ల కాలపరిమితితో షేర్లలో ఎస్ఐపీ చేయడం ఉత్తమం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- SIP
- Stock Investments
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

