కశ్మీర్లో బలవంతంగా పెళ్లి, మతమార్పిడులు.. కిషన్ రెడ్డికి సిక్కుల ఫిర్యాదు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇటీవల సిక్కు మతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను బలవంతంగా పెళ్లి చేసుకుని, మతమార్పిడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అకాలీదళ్ నేతలు అక్కడ భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. గన్‌పాయింట్‌లో బెదిరించి తమ మతానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నట్లు సిక్కులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని, వారిని ఇస్లాం మతంలోకి మార్చి నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఓ అమ్మాయి పరారీ అయి తన స్వంత ఇంటికి చేరుకున్నది. మరో అమ్మాయి పరిస్థితి ఇంకా తెలియలేదు. అకాలీదళ్ నేత మణ్జిందర్ సింగ్ సిస్రా ఆధ్వర్యంలో సిక్కులు నిరసనలు కూడా చేపట్టారు. జమ్మూకశ్మీర్‌లో కూడా మతమార్పిడిని వ్యతిరేకిస్తూ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొందరు సిక్కు నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డిని కలిశారు. కశ్మీర్లో సిక్కు అమ్మాయిలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటున్న ఘటనల గురించి వారు మంత్రికి వివరించారు. బీజేపీ నేత ఆర్పీ సింగ్ ఆ బృందంలో ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

