Siddaramaiah: కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య.. రెండేళ్ల తర్వాత డీకేకు ఛాన్స్ !
Siddaramaiah: తాజా సమాచారం ప్రకారం.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల తర్వాత డీకే శివకుమార్‌కు సీఎం పోస్టును అప్పగించే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య(Siddaramaiah)ను హై కమాండ్ నిర్ణయించినట్లు కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది. సీఎం పోస్టు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎన్నిక విషయంలో జాప్యం చేస్తోంది. ఇవాళ కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేతల్ని కలిశారు.
కొన్ని వర్గాల ప్రకారం.. డీకే శివకుమార్ ఎటువంటి పోస్టును ఆశించడం లేదని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు డీకే సిద్ధంగా లేరని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్లో ఏ స్థానాన్ని ఆయన ఆశించడం లేదని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. కొన్ని వర్గాలు మాత్రం డీకే.. డిప్యూటీ సీఎం పదవిని తీసుకునే ఛాన్సు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. అయితే సీఎం సిద్ధరామయ్యే అన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
రేపు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. డీకే శివతో సోనియా గాంధీ ఫోన్లో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత సీఎం బాధ్యతలను డీకే శివకుమార్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. పవర్ షేరింగ్ గురించి సోనియా, రాహుల్‌తో డీకే మాట్లాడినట్లు స్పష్టమవుతోంది.
224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో.. కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలుచుకున్నది. మే 13న వెలుబడిన ఫలితాల్లో బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

