South Africa | దక్షిణాఫ్రికాలో అధికార ఏఎన్‌సీకి షాక్.. 30 ఏండ్ల తర్వాత మెజార్టీ కోల్పోయిన పార్టీ
దక్షిణాఫ్రికా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. తెల్లవారి వర్ణవివక్ష నుంచి దేశాన్ని విముక్తి చేసిన ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు.
- పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ
South Africa | జొహన్నెస్‌బర్గ్, జూన్ 1: దక్షిణాఫ్రికా పార్లమెంట్ ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. తెల్లవారి వర్ణవివక్ష నుంచి దేశాన్ని విముక్తి చేసిన ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు. శనివారం విడుదలైన చారిత్రక ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తెల్లవారి పాలన అంతం చేసి అధికారం చేపట్టిన 30 ఏండ్ల అప్రతిహత ఏఎన్సీ పాలనకు ఆ దేశ ప్రజలు వీడ్కోలు పలుకుతూ విభిన్నమైన పాఠం చెప్పారు. బుధవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం 99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా అధ్యక్షుడు రాంఫోసా నేతృత్వంలోని అధికార ఏఎన్‌సీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ప్రధాన ప్రతిపక్షం డెమోక్రాటిక్ అలయెన్స్ 21 శాతం, ఏఎన్సీ నుంచి విభేదించి బయటకు వచ్చిన మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు చెందిక ఎంకే పార్టీకి 14 శాతం ఓట్లు, ద ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్‌కు 9 శాతం వచ్చాయి. విపక్షాలకు చెందిన 50 పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీపడ్డాయి.
1994లో నెల్సన్ మండేలా నేతృత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ఆ పార్టీ ఎన్నికల్లో ఓటమి చవిచూడటం ఇదో తొలిసారి. దేశంలో నెలకొన్న అసమానత, పేదరికం, విద్యుత్ సమస్య, నీటి సమస్య, విస్తతృ స్థాయిలో నిరుద్యోగం, విచ్చలవిడిగా అవినీతి పెరగడానికి కారణమైన ఏఎన్‌సీకి బుద్ధి చెప్పేలా ప్రజలు సరైన తీర్పు చెప్పారని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో ఏఎన్సీ ఓడినా ఒక విధంగా పార్లమెంట్లో ఆ పార్టీయే పెద్దది. అయితే ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పరుచుకుంటే ప్రస్తుత అధ్యక్షుడు సిరిల్ రాంఫోసా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలైన 14 రోజుల్లోగా అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

