పార్లమెంట్‌లోనే బెదిరించారు.. యాసిడ్ దాడి చేస్తామన్నారు: ఎంపీ నవ్‌నీత్

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనను పార్లమెంట్ లాబీలోనే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ బెదిరించారని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవ్‌నీత్ కౌర్ రాణా. తనను జైల్లో వేస్తానని కూడా ఆయన బెదిరించినట్లు స్పీకర్‌కు రాసిన లేఖలో నవ్‌నీత్ వెల్లడించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలపై ఆమె లోక్‌సభలో మాట్లాడారు. అప్పటి నుంచీ తనకు బెదిరింపు కాల్స్, శివసేన లెటర్‌హెడ్ ఉన్న లేఖలు వస్తున్నట్లు ఆమె చెప్పారు.
తనపై యాసిడ్ దాడి చేస్తానని కూడా ఓ లేఖలో బెదిరించినట్లు నవ్‌నీత్ కౌర్ ఆరోపించారు. శివసేన ఎంపీ అరవింత్ తనను బెదిరించడం తనకే కాదు, దేశ మహిళలందరికీ అవమానమే అని ఆమె స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తాను. నిన్ను జైల్లో వేస్తానని లోక్‌సభ లాబీలోనే అరవింద్ బెదిరించారు. నా పక్కనే సహచర ఎంపీ ఉన్నారు. ఆయన కూడా అరవింద్ మాటలను విన్నారు అని నవ్‌నీత్ లేఖలో చెప్పారు. అరవింద్ సావంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఆమె ఆరోపణలను అరవింద్ ఖండించారు. ఉద్ధవ్ థాక్రే గురించి మాట్లాడితే నీ అందమైన మొహంపై యాసిడ్ పోస్తామని కూడా తనకు బెదిరింపు లేఖలు వచ్చినట్లు నవ్‌నీత్ వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

