దూసుకొచ్చే పాట బుల్లెట్
తమిళ హీరో శింబు బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనతో పాటు గాయకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. గతంలో ‘బాద్షా’ ‘పోటుగాడు’ చిత్రాల్లో ఆయన గొంతు సవరించారు. చాలా కాలం విరామం తర్వాత శింబు తెలుగు చిత్రం ‘ది వారియర్’లో ఓ పాట పాడారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో ఉన్న ఆత్మీయ స్నేహం వల్ల శింబు పాటను ఆలపించడానికి ఒప్పుకున్నారని చిత్ర బృందం పేర్కొంది. త్వరలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. జూలై 14న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘శింబు ఈ సినిమాలో ‘బుల్లెట్..’అనే పాటను పాడారు. మాస్ బీట్తో సాగే గీతమిది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన బాణీకి.. శింబు గాత్రం తోడవడంతో పాట మరో స్థాయిలో తయారైంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో హీరో రామ్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు’ అని చెప్పారు. కృతిశెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

