ముంబై : బాలీవుడ్ భామల్లో ఫిట్నెస్ ఐకాన్‌గా పేరొందిన శిల్పా శెట్టి (Shilpa Shetty) ఫిట్‌గా ఉండేందుకు వర్కవుట్ రొటీన్స్పై కసరత్తు సాగించినా టేస్టీ రెసిపీలనూ అదే రేంజ్లో ఆస్వాదిస్తుంది. ఆన్‌స్క్రీన్‌లో మెరవడంతో పాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ వెల్నెస్ పవర్హౌస్లా ఆమె తళుకులీనుతుంది.
ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించాలని చెప్పే శిల్పా శెట్టి గ్లూటెన్ రహిత, వెగాన్, షుగర్ ఫ్రీ డైట్ తీసుకునేందుకు మొగ్గుచూపుతుంది. తినడం కూడా ఓ ఆనందమేనని ఆమె ఇన్‌స్టా ఫీడ్ చూస్తే తెలుస్తుంది. రుచికరమైన పోషకాలతో కూడిన ఆహార పదార్ధాల గురించి ఆమె తన పోస్టుల్లో తరచూ ప్రస్తావిస్తుంది.
ఇక ఇటీవల తాను నోరూరించే మెవర్ థాలిని కనుగొన్నానని శిల్పా శెట్టి సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలను షేర్ చేశారు. పిట్నెస్ ప్రియురాలైన శిల్పా శెట్టి బెస్ట్ థాలిలో రోటీలు, రైస్, పాపడ్స్తో పాటు పసుపుతో కూడిన సబ్జీ, కర్రీ, సోయాబీన్ ఖీమా, గోబీ పకోడా, మటర్ పులావ్, మక్కీ రోటీ, మిల్లెట్ రోటీ, పుల్కా వంటివి ఉన్నాయి.
Read More :
Telangana | 6 గ్యారెంటీలకు 28 నుంచి దరఖాస్తులు.. గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక