Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Sheikh Hasina | భారత్ నుంచి స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hassina) కు చుక్కెదురైంది. డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వస్తానని ఆమె చేసిన ప్రతిపాదనను బంగ్లాదేశ్ సర్కారు తిరస్కరించింది. తన ప్రయాణం కోసం ఢిల్లీ నుంచి ఢాకా (Dhaka) కు విమానంతోపాటు ఇతర ప్రయాణ పత్రాలు ఏర్పాటు చేయాలన్న హసీనా ప్రతిపాదనకు బంగ్లా ప్రభుత్వం నిరాకరించింది.
Sheikh Hasina : భారత్ నుంచి స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hassina) కు చుక్కెదురైంది. డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వస్తానని ఆమె చేసిన ప్రతిపాదనను బంగ్లాదేశ్ సర్కారు తిరస్కరించింది. తన ప్రయాణం కోసం ఢిల్లీ నుంచి ఢాకా (Dhaka) కు విమానంతోపాటు ఇతర ప్రయాణ పత్రాలు ఏర్పాటు చేయాలన్న హసీనా ప్రతిపాదనకు బంగ్లా ప్రభుత్వం నిరాకరించింది. దేశంలోకి అడుగుపెడితే వెంటనే అరెస్టు చేస్తామని హెచ్చరించింది.
ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. షేక్ హసీనా సాధారణ ప్రయాణికురాలు కాదని, కోర్టు శిక్షించిన నేరస్థురాలని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హుమాయున్ కోబిర్ అన్నారు. హసీనా స్వదేశానికి వస్తే చేతులకు సంకెళ్లతో జైలుకు పంపుతామని చెప్పారు. ఆమె బంగ్లా గడ్డపై అడుగుపెట్టిన వెంటనే అదుపులోకి తీసుకుని జైలుకు తరలిస్తామని అన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని స్పష్టంచేశారు.
ఈ నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా వచ్చే నెల బంగ్లాదేశ్ లిబరేషన్ డే సందర్భంగా 16న తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని హసీనా గతంలో వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె ప్రతిపాదనను బంగ్లా సర్కారు తిరస్కరించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

