న్యూఢిల్లీ, జనవరి 22: ప్రస్తుతం మనం వాట్సాప్లో షేర్ చేసే ఇమేజ్లు అవతల వాళ్లకు దాని ఒరిజనల్ క్వాలిటీ కంటే తక్కువతో డౌన్లోడ్ అవుతాయి. దీనికి పరిష్కారంగా సరికొత్త ఫీచర్ను సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ ద్వారా ఒరిజనల్ క్వాలిటీతో ఫొటోలను ఇతరులతో పంచుకోవచ్చు. వాట్సాప్ సంస్థ కొత్త ఫీచర్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నదని ఆన్లైన్ వెబ్సైట్ వాబెటాఇన్ఫో నివేదిక పేర్కొన్నది.