టీమ్ఇండియా యువ క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన బ్యాచిలర్ జీవితానికి ఫుల్స్టాప్ పెడుతూ చిరకాల స్నేహితురాలు మిత్తాలీ పారుల్కర్‌తో శార్దుల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు సహచర క్రికెటర్లు రోహిత్‌శర్మ, అభిషేక్ నాయర్, ధవల్ కులకర్ణి హాజరయ్యారు.