Sewarage treatment plants | దసరాలోపు కొత్త ఎస్టీపీల నిర్మాణం
Sewarage treatment plants | దసరాలోపు కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను

సిటీబ్యూరో, డిసెంబర్ 29: దసరాలోపు కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. నూతనంగా చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణంపై బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్యాకేజ్-3 కింద నిర్మించనున్న 17 ఎస్టీపీల పురోగతిని ఆయన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా సాయిల్ టెస్ట్‌లను కూడా పూర్తి చేయాలని చెప్పారు. పక్కా ప్రణాళికలతో 24 గంటలు పనులు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. మూడు షిఫ్ట్‌ల్లో కార్మికులు ఉండేల చూసుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల స్థలాభావం ఉన్న కారణంగా ఎస్టీపీల సామర్థ్యాన్ని తగ్గించవద్దని దానకిషోర్ అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో కచ్ఛితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆైన్లెన్ మానిటరింగ్ కోసం జలమండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని అన్నారు. నిర్మాణంలో కార్మికుల రక్షణకు కూడా ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం. సత్యానారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

