సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..

సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ): రోడ్డు నిబంధనలు పాటించి.. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని డ్రగ్స్ ఫ్రీ వరల్డ్ జూనియర్ అంబాసిడర్గా సేవలందిస్తున్న చిన్నారి తానియా బేగం పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ‘సెల్ఫీ విత్ హెల్మెట్ పపా, సెల్ఫీ విత్ హెల్మెట్ మమ్మీ’ డ్రైవ్ను ప్రారంభించింది. హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య పెరుగుతుందని తెలిపింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించింది. అందరూ హెల్మెట్ ధరించి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పేర్కొంది. అలా, దిగిన వారు మరో ఐదుగురిని నామినేట్ చేస్తూ పోస్ట్ చేయాలని కోరింది. చిన్నారి తానియా బేగం శుక్రవారం అంబర్పేటలో హెల్మెట్ ధరించి తన తల్లితో సెల్ఫీ దిగి ఐదుగురిని నామినేట్ చేసింది. కాగా, డ్రగ్స్ ఫ్రీ వరల్డ్ అనే అంతర్జాతీయ సంస్థ తానియాను భారత జూనియర్ అంబాసిడర్గా 2017 డిసెంబర్ 15న నియమించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

