300 కిలోల గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలం పట్టణంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణ సీఐ స్వామి ఆధ్వర్యంలో ప్రొబేషనరీ ఎస్సైలు రాము, రంజిత్‌కుమార్ తమ సిబ్బందితో బ్రిడ్జి సెంటర్లోని ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఒక బొలేరో వాహనం, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనంపై నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని ఆపి వాహనాలను తనిఖీ చేశారు. వాటిల్లో 300 కేజీల గంజాయి ఉంది. దీని విలువ సుమారు రూ.45 లక్షలు ఉంటుంది. నిందితులను ప్రశ్నించగా తమ పేర్లు దునియా, నాయక్ రాజేశ్, డోంగ్రి రాజేశ్ అలియాస్ టుబే, బిసాయి డోము అలియాస్ సాయి, అలియాస్ సుదర్శన్ అని చెప్పారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని డొంకరాయికి చెందిన వారు. సీలేరులో గంజాయిని కొనుగోలు చేసి సారపాక వైపు రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

