జూలూరుపాడు, మే 22 : ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ పట్టణానికి చెందిన దంపతులు సూటీపై ఖమ్మం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపంలో సీతారామ వంతెన వద్దకు చేరుకోగానే వాహనం నుంచి ఒకసారిగా మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన దంపతులు స్కూటీని రోడ్డుపై నే వదిలేసి పక్కకువెళ్లారు. కొద్ది క్షణాల్లోనే మంటలు వ్యాప్తించడంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు ఎండల తీవ్రత కారణమా? లేదా వాహనంలో తలెత్తిన లో పమా? అనేది తెలియాల్సి ఉంది. వా హన యజమానులు అకడి నుంచి వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.