స్వర్గ రేఖ!.. సౌదీ అరేబియా ఎడారుల్లో మెట్రో నగరం

- ఒకే లైన్లో 170 కిలోమీటర్ల నిర్మాణం
- ప్రమాదాలు జరగకుండా భూగర్భంలో లేయర్లు
- 7.5 లక్షల కోట్లతో మూడేండ్లలో పూర్తి
ప్రపంచంలోనే అత్యాధునిక నగరానికి అంకురార్పణ జరిగింది. ఐదు దశాబ్దాలు నిర్విరామ కృషి చేసినా సాకారం కాని.. ఓ మహాద్భుత సిటీని మరో మూడేండ్లలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాలుష్యమన్నదే లేని ఆ నగరమే ‘స్వర్గ రేఖ’ (లైన్ ఆఫ్ ప్యారడైజ్). ఎడారి దేశం సౌదీ అరేబియాలో ఈ నగర నిర్మాణం ఇటీవలే ప్రారంభమయ్యింది.
–నేషనల్ డెస్క్
ఏమిటీ స్వర్గ రేఖ?
వాయవ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్సు నుంచి ఎర్ర సముద్రాన్ని కలుపుతూ.. ఎలాంటి వీధులు లేకుండా.. ఒకే సరళ రేఖ నిర్మాణంలో ఈ సిటీని నిర్మిస్తున్నారు. దీనినే ‘స్వర్గ రేఖ’గా పిలుస్తున్నారు. 170 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈ ‘స్వర్గ రేఖ’ను మూడు లేయర్లుగా నిర్మిస్తున్నారు.
ఎందుకు ఈ నగరం?
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, వేగవంతమైన సేవలను అందించమే ఈ నగరం లక్ష్యం.

ఖర్చెంత?
రూ. 7.5 లక్షల కోట్లతో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. 2024లో అందుబాటులోకి రానున్న ఈ నగరంలో 10 లక్షల మంది వరకు నివసించవచ్చు. ఈ నిర్మాణంతో 3.8 లక్షల మందికి ఉపాధి లభించనున్నది.
ఉపరితల నగరం: వాహనాలను అనుమతించబోరు. కేవలం ప్రజలు నడవడానికే అనుమతిస్తారు. సరళరేఖ మీద నాలుగు ప్రధాన ప్రాంతాల్లో పర్యావరణహిత రెసిడెన్షియల్ సముదాయాలను నిర్మిస్తారు. ఇందులోనే పాఠశాలలు, రెస్టారెంట్లు, దుకాణాలు కూడా ఉంటాయి. కేవలం ఐదు నిమిషాల నడకతో ఈ ప్రాంతాలను చేరుకోవచ్చు.
భూగర్భ నగరం-1: ఉపరితల నగరం కింద.. భూగర్భంలో దీన్ని నిర్మిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు, వైద్య సేవలు, డెలివరీ వస్తువులు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి.
భూగర్భ నగరం-2: భూగర్భ నగరం-1 కింద ఇది ఉంటుంది. ప్యాసింజర్, గూడ్స్ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కృత్రిమ మేధ సాయంతో అల్ట్రా హైస్పీడ్‌తో ఇవి పనిచేస్తాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

