పర్యావరణాన్ని పరిరక్షించాలి.. మాజీ ఎంపీ సంతోష్‌కుమార్
ఆధ్యాత్మికతను ప్రకృతి పరిరక్షణతో అనుసంధానిస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ వినూత్న కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
- అకన్న- మాదన్న ఆలయాల్లో ఉసిరి, బిల్వ మొక్కల పెంపకం
బీబీనగర్, నవంబర్ 12 : ఆధ్యాత్మికతను ప్రకృతి పరిరక్షణతో అనుసంధానిస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ వినూత్న కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం’ కార్యక్రమంలో భాగంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్‌పూర్‌లో అ కన్న-మాదన్న ఆలయాలను సందర్శించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాయకపు మాధురి వెంకటేశ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఉసిరి, బిల్వ మొకలు నాటారు. ఈ సందర్భంగా కార్తికమాసంలో ఉసిరి చెట్టుకు ఆరోగ్యపరంగా, బిల్వ వృక్షానికి ఆధ్యాత్మికంగా ఉన్న విశిష్టతను సంతోష్ వివరించా రు.
ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి, బిల్వ వృక్షం శివుడికి ప్రీతిపాత్రమైనవిగా తెలిపారు. ఈ మొక్కలను పెంచడం ద్వారా సంప్రదాయ వృక్ష సంపదను కాపాడటంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని చెప్పారు. ప్రతి ఇంట్లో ఉసిరి, ప్రతి ఆలయంలో బిల్వ వృక్షం ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. మొకలు నాటడ మేగాక సంరక్షణ బాధ్యతనూ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ యర్కల సుధాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మాజీ కోఆర్డినేటర్ బొక జైపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, సర్పంచ్ దండెం అనితాప్రభాకర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

