హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల పాఠశాలలకు ఈ నెల 13 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించింది. 5 రోజుల పాటు సెలవులు ఇవ్వగా, తిరిగి 18న తెరుచుకోనున్నాయి.
జూనియర్ కాలేజీలకు 13 నుంచి 15 వరకు సెలవులు ఇచ్చి, 16న తరగతులు పున: ప్రారంభం అవుతాయని వెల్లడించింది.