Samajavaragamana Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న సామజవరగమన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Samajavaragamana Movie | శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకుడు. మౌత్ టాక్‌తో హిట్ అయిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లోనే రూ.19.8 కోట్లు వసూళ్ చేసి మంచి విజయం సాధించింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఆలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
Samajavaragamana Movie | ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు (Sree Vishnu) ముందు వరుసలో ఉంటాడు. జయాపజాయలతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’(Samajavaragamana). రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకుడు. మౌత్ టాక్‌తో హిట్ అయిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లోనే రూ.19.8 కోట్లు వసూళ్ చేసి మంచి విజయం సాధించింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఆలరించిన ఈ చిత్రం తాజాగా.. ఓటీటీ (Samajavaragamana OTT) లాక్ చేసుకుంది.
ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా (AHA) దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. “నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, సామజవరగమన దానికి చక్కటి రూపం, ఇక నో ఆలస్యం…ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం” అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది. కాగా జులై 28నుంచి ఈ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 29న విడుదలైన ఈ సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏకే ఎంటర్టైనమెంట్స్ (AK Entertainments), హస్య మూవీస్ (Hasya Movies) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్ (Reba Monica John) నటించింది. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
నవ్వడం ఒక భోగం….😄
నవ్వించడం ఒక యోగం💁🏻♀️
సామజవరగమన దానికి చక్కటి రూపం.😉
ఇక నో ఆలస్యం…ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం..!#SamajavaragamanaOnAHA@sreevishnuoffl @Reba_Monica @ItsActorNaresh @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @HasyaMovies @AKentsOfficial pic.twitter.com/P5TcmbR87O— ahavideoin (@ahavideoIN) July 21, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

