ఆ విషయం గురించి రోజూ ప్రార్థిస్తా!
పెద్దగా మేకప్హంగులు లేకుండా తెరపై సహజసిద్ధమైన అందంతో మెరిసిపోతుంటుంది తమిళ సోయగం సాయిపల్లవి. అందుకే అభిమానులు ఆమె నేచురల్ బ్యూటీ అని పిలుస్తుంటారు. నటనతో పాటు అందంలో కూడా సహజత్వంతో అలరారే ఈ భామ సౌందర్య ఉత్పత్తులకు చాలా దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
పెద్దగా మేకప్హంగులు లేకుండా తెరపై సహజసిద్ధమైన అందంతో మెరిసిపోతుంటుంది తమిళ సోయగం సాయిపల్లవి. అందుకే అభిమానులు ఆమె నేచురల్ బ్యూటీ అని పిలుస్తుంటారు. నటనతో పాటు అందంలో కూడా సహజత్వంతో అలరారే ఈ భామ సౌందర్య ఉత్పత్తులకు చాలా దూరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. వాటి బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారానికి కూడా అస్సలు అంగీకరించదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చర్మసంరక్షణ, ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుందీ అమ్మడు. ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు, మేకప్ కంటే శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని, అదే సహజమైన అందాన్ని తీసుకొస్తుందని అభిప్రాయపడింది.
‘ఆహారం విషయంలో నేను పరిమితుల్ని పాటిస్తా. వెజిటెబుల్స్తో పాటు నట్స్ ఎక్కువగా తీసుకుంటా. ఎక్సర్సైజ్ని నా దినచర్యలో ఓ భాగంగా చేసుకున్నా’ అని చెప్పింది. తానింతవరకూ షాంపు ఉపయోగించలేదని, కేశసంరక్షణ కోసం అలోవెరాతో తయారుచేసిన నేచురల్ షాంపుని వాడతానని, జుట్టుని మూడురోజులకు ఒకసారి మాత్రమే శుభ్రం చేసుకుంటానని సాయిపల్లవి చెప్పింది. అన్నింటికంటే ముఖ్యంగా జట్టు అస్సలే ఊడిపోవద్దని ప్రతి రోజు దేవుణ్ణి ప్రార్థిస్తుంటానని, అది మానసికంగా చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చిందీ భామ. ప్రస్తుతం సాయిపల్లవి ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

