భీమ్లా నాయక్ ప్రిరీలీజ్ ఈవెంట్ (Bheemla Nayak event) అట్టహాసంగా జరిగింది. ఈవెంట్లో డైరెక్టర్ సాగర్ కే చంద్ర (Sagar k chandra) మాట్లాడుతూ..2011లో ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. అప్పటికే ఇండస్ట్రీకి వచ్చా. నేను అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్‌ను. గచ్చిబౌలి స్టేడియంలో ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. ఈవెంట్ పాస్ దొరికింది. కల్యాణ్ గారిని చూడాలనుకున్నాను. అది సాధ్యం కాదని తెలిసిపోయింది. మూడుసార్లు బయటకు తోసేశారు.
అటువంటి పొజిషన్ నుంచి ఇక్కడకు వచ్చి పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయడం మరిచిపోలేని క్షణం. రానా, నిత్యమీనన్, రావు రమేశ్, సముద్రఖని, సంయుక్తామీనన్తోపాటు అందరికి కృతజ్ఞతలు. నన్ను ఫస్ట్ టైం ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చిన నాగవంశికి ధన్యవాదాలు. ఆత్మీయులు చినబాబు, బ్యాక్ బోన్ ఆఫ్ భీమ్లా నాయక్ త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు.. అని చెప్పారు.